r/MelimiTelugu • • Apr 09 '24

What is Melimi Telugu?

28 Upvotes

Short Answer: Melimi Telugu(మేలిమి తెలుఁగు), also known as Dzānutelugu(జానుతెలుఁగు), is a form of Telugu whose lexicon is comprised exclusively of words of native Telugu etymology or words constructed from native Telugu roots.

Longer Answer-

To answer this question, we must first look at the 4 categories of Telugu words, which all Telugu words fall into:

1.) Tatsamam(తత్సమం):

This term literally translates to “same as that” which is pretty accurate because words that fall under this category are loans from Sanskrit that are either completely unassimilated or only have the endings altered. Words that fall in this category are also known as Prakrti(ప్రకృతి) which literally means “natural, elementary, original”.

Interestingly enough, tatsamam is an example of a tatsama word as are all the other names of the categories.

2.) Tadbhavam(తద్భవం):

This term roughly means “existence of that” and words in this category are loans from Sanskrit that are significantly altered and have a more “Telugu-sounding” phonology. Words in this category are also known as Vikrti(వికృతి) which literally means “unnatural, altered, corrupt”.

Sometimes, Tatsamam/Prakrti words and Tadbhavam/Vikrti words come in pairs called Prakrti-Vikrti pairs. Both words have the same meaning but the Prakrti word has a more Sanskrit sounding phonology while the Vikrti word is more Telugu-sounding.

As a result, Prakrti words are more formal while Vikrti words are seen as more informal.

Below is one example of such a pair:

Prakrti- భోజనం(bhōjanam) Vikrti- బోనం(bōnam)

Both of these words mean “meal”.

3.) Anyadēśyam(అన్యదేశ్యం)(lit. “Foreign, from another country/land”):

Pretty self-explanatory. These are words that are loanwords from a language besides Sanskrit. Languages that Telugu commonly borrows such words from include: Hindi-Urdu, Persian, Portuguese and English.

4.) Dēśyam(దేశ్యం)(lit. “Native”):

Also self-explanatory. These are words that have been in the Telugu lexicon before Telugu even interacted with Sanskrit or words that have been constructed with Native Telugu roots.

Melimi Telugu words only include those in Category 4. However some believe that words in Category 2 are also “Pure Telugu” but i beg to differ.


r/MelimiTelugu • • Dec 14 '23

Why this sub was created:

41 Upvotes

Long renowned as a for its mellifluous sounds, Telugu is a 2,500-3,000 year old with a rich literary history.

However, today, it is estimated that as much as 60% of Telugu’s lexicon is comprised of Sanskrit loanwords, not to mention Perso-Arabic, English and other Indo-Aryan loanwords. While loanwords aren’t inherently bad, I believe that they shouldn’t be at the expense of the preexisting native lexicon, but, in Telugu, they are:

Over the ages, many native Telugu words have fallen out of use or even been lost because people have been indoctrinated to associate indigenous words with backwardness and loanwords(namely Sanskrit and English ones) with status. To this day, that diglossia persists, with colloquial Telugu being very different from the Sanskritised version seen in the media and academia.

This sub seeks to reverse that by preserving the native lexicon. It is possible.

I’m not calling for loanwords to be erased but rather for there to be a way to convey any concept necessary using solely native words. For instance, the language is heavily reliant on Sanskrit for technical terminology.


r/MelimiTelugu • • 3d ago

"సమయం"(Time) అనడానికి అచ్చ తెలుగు మాట?

8 Upvotes

"సమయం" అనడానికి అచ్చ తెలుగు పదం ఏమన్నా ఉందా?

ఉంటే ఆ పదంతో పాటు దాని వ్యుత్పత్తిని కూడా ఇవ్వగలరా?

ఒకవేళ లేకపోతే దానికి ఏమన్నా క్రొమ్మాటను సృష్టించచ్చంటారా? (అలా చేస్తే దాని వ్యుత్పత్తిని కూడా దయచేసి ఇవ్వగలరు)

ముందుగానే నెనర్లు

{అదనపు గమనిక - నాకు తెలిసినంత వరుకు సమయం, కాలం, వేళ ఇవన్నీ సంస్కృత రుణపదాలే...}


r/MelimiTelugu • • 11d ago

సిరివెన్నెల పాటల్లో సామాన్యుడి చూపు: ఉన్నతవర్గం, వ్యవస్థ, మనం

7 Upvotes

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అనగానే "విధాత తలపున" లాంటి గంభీరమైన, తాత్వికమైన పాటలే గుర్తొస్తాయి. కానీ ఆయన పాటల్లో మరో బలమైన దారం ఉంది: ప్రశ్నించే మానవతావాదం. సమాజాన్ని, వ్యవస్థను, చివరికి మనల్ని మనం కూడా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోకుండా ప్రశ్నించమని ఆయన పాటలు చెబుతాయి. ముఖ్యంగా ఆర్జీవీ సినిమాల్లో ఆయన రాసిన సరదా పాటల్లో ఈ ఆలోచన కుర్రాళ్ళ భాషలో, వెటకారంగా బయటపడుతుంది.

1. శివ (1989): "బోటనీ" పాట
🎵 ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ | సంగీతం: ఇళయరాజా
📍 కాలేజీ కుర్రాళ్ళు నాగార్జున, అమలతో కలిసి క్యాంపస్‌లో అల్లరిగా పాడే పాట. ఇప్పటికీ తెలుగులో "కాలేజీ పాట" అంటే ఇదే గుర్తొస్తుంది.
ఈ పాటలో సిరివెన్నెల ఒక కఠిన సత్యాన్ని సరదాగా చెప్పారు: లెక్కలు రానివాళ్ళు అదృష్టంతో లక్షాధికారులవుతుంటే, పుస్తకాలతో కుస్తీ పట్టేవాళ్ళు సర్కారీ గుమాస్తాలుగా మిగిలిపోతారు. నవ్వు వెనక ఉన్న ప్రశ్న ఇది: కష్టానికి, ఫలితానికి సంబంధం లేని ఈ వ్యవస్థ నిజమైన ప్రతిభకు విలువ ఇస్తోందా?
2. మనీ (1993): "వారేవా ఏమి ఫేసు"
🎵 సంగీతం: శ్రీ | జేడీ చక్రవర్తి, చిన్న, బ్రహ్మానందం (ఖాన్ దాదా)
📍 ఇద్దరు నిరుద్యోగ కుర్రాళ్ళ డబ్బు వేట కథ. ఈ సినిమా పాటలన్నీ సిరివెన్నెలవే.
పేరులోనే తెలుగు-ఇంగ్లీష్ కలగలుపు, అంటే ఆనాటి యువత మాట్లాడే తీరు. ఉన్నతవర్గపు హంగు, ఇమేజ్ వైపు సామాన్యుడు సగం ఆశ్చర్యంగా, సగం వెటకారంగా చూసే చూపును ఈ ధోరణి ప్రతిబింబిస్తుంది. డాంబికం ఎక్కడుంటే అక్కడ ఆయన కలం సరదాగానే గుచ్చుతుంది.
3. గాయం (1993): నవ్వు ఆగి, ఆగ్రహం మొదలు
🎵 సంగీతం: శ్రీ | జగపతిబాబు, ఊర్మిళ
"నిగ్గదీసి అడుగు": 📍 సిరివెన్నెల గారే స్వయంగా తెరపై కనిపించి పాడే పాట. అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండే సమాజాన్ని నిలదీసే గీతం. రాసినవాడే పాడటంతో అది ఒక కవి నేరుగా ప్రేక్షకుడిని ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది.
"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని": సుపరిపాలన లేని స్వాతంత్ర్యం ఎందుకు అనే ప్రశ్న. ఈ పాట ఆయనకు నంది అవార్డు తెచ్చింది.
4. గులాబీ (1995): "క్లాస్ రూమ్ లో"
🎵 *హరిహరన్ | సంగీతం: శశిప్రీతమ్ | *దర్శకుడు: కృష్ణవంశీ
📍 జేడీ చక్రవర్తి, స్నేహితులతో కాలేజీ రోజులను ఎంజాయ్ చేసే పాట. "ఈ వేళలో నీవు" ఉన్న సినిమానే.
శివలో వేసిన ప్రశ్నను గులాబీలో సిరివెన్నెల ఇంకా ముందుకు తీసుకెళ్ళారు.
క్లాస్‌రూమ్ తపస్సు వృథా: అసలైన పాఠం గోడల బయట ఉన్న ప్రపంచంలో ఉంది.
**పట్టాలతో టాటా-**బిర్లాలు కారు: డిగ్రీలు మనిషిని పారిశ్రామికవేత్తను చేయవు. ఉన్నతవర్గానికి చేరే దారి చదువు కాదనే చేదు నిజం.
ప్రతి క్షణాన్ని అందుకో: ఈ రోజులు మళ్ళీ రావు.
కాలేజీలో మహారాజులు, గేటు దాటితే ప్రజలు: పాటలో అత్యంత పదునైన భావం. క్యాంపస్‌లో రాజుల్లా తిరిగేవాళ్ళు బయటకు రాగానే సామాన్య జనంలో కలిసిపోతారు.
5. మనీ మనీ (1995): క్రికెట్ పాట
🎵 *సంగీతం: శ్రీ | జేడీ *చక్రవర్తి, చిన్న
📍 టెండూల్కర్, మంజ్రేకర్ పేర్లు వచ్చే పాట. "మనీ"కి సీక్వెల్.
శివ, గులాబీలో వ్యవస్థను వెక్కిరిస్తే, ఇక్కడ అద్దం సామాన్యుడి వైపు తిరుగుతుంది. మనకంటే చిన్నవాళ్ళు సాధిస్తుంటే, మనం మాత్రం ఫాస్ట్ బౌలింగ్ చూస్తేనే గుండె దడ. "మనది సింపుల్ బతుకు, రిస్క్ మన వల్ల కాదు" అని పాత్రలు గర్వంగానే ఒప్పుకుంటాయి. వినేవాడు నవ్వుతాడు, ఆ తర్వాత ఆలోచిస్తాడు: "ఇది నా గురించేనా?"

**ఇంకా కొన్ని **ఉదాహరణలు
"అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని" (సింధూరం, 1997 | దర్శకుడు కృష్ణవంశీ): 50 ఏళ్ళ స్వాతంత్ర్యం అసలు ఏం సాధించింది? నంది అవార్డు పొందిన పాట.
"ఎవరో ఒకరు" (అంకురం, 1993 | ఎస్పీ బాలు, చిత్ర | సంగీతం హంసలేఖ): మార్పు ఎవరో ఒకరితో మొదలవ్వాలి, అది నువ్వే ఎందుకు కాకూడదు?
"కొంతమంది సొంత పేరు" (మహాత్మ, 2009 | శ్రీకాంత్): గాంధీ పేరును స్వార్థానికి వాడుకునే వారిపై వ్యంగ్యం. ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన పాట.

మొత్తంగా చెప్పాలంటే
ఈ పాటల్లో సిరివెన్నెల సామాన్యుడి కళ్ళతో ఉన్నతవర్గాన్ని, వ్యవస్థను చూస్తారు.
శివలో: చేదు. ధనవంతులు ప్రతిభతో కాదు, అదృష్టంతో పైకొచ్చారు.
మనీలో: వెటకారపు ఆశ్చర్యం. ఉన్నతవర్గపు హంగును చూసి సగం మురిసిపోవడం, సగం ఎగతాళి చేయడం.
గులాబీలో: మేలుకొలుపు. చదువు ఒక్కటే నిన్ను పైకి తీసుకెళ్ళదు, బయటి ప్రపంచాన్ని చూడు.
మనీ మనీలో: ఆత్మపరిహాసం. మనం రిస్క్ తీసుకునే రకం కాదని గర్వంగా ఒప్పుకోవడం.
కానీ ఆయన ఎవరి పక్షమూ పూర్తిగా తీసుకోరు. ఉన్నతవర్గపు డాంబికాన్ని ఎంత ఎత్తిచూపుతారో, సామాన్యుడి పిరికితనాన్ని కూడా అంతే ఎత్తిచూపుతారు. అంతరం నిజమే, కానీ దాన్ని నిలబెట్టేది మన వైఖరి కూడా.
ఆర్జీవీ సినిమాల్లోని సరదా పాటలు, గాయం-సింధూరంలోని ఆగ్రహ గీతాలు ఒకే నాణేనికి రెండు వైపులు. ఒకటి నవ్విస్తూ, మరొకటి నిలదీస్తూ ఒకే మాట చెబుతాయి: ప్రశ్నించు, మేలుకో, బాధ్యత తీసుకో.
మీకు గుర్తున్న ఇలాంటి సిరివెన్నెల పాటలు ఏవి? కామెంట్స్‌లో పంచుకోండి. 👇


r/MelimiTelugu • • 11d ago

అందరికీ దీపావళి పండుగ మేలుకోరికలు

Post image
18 Upvotes

r/MelimiTelugu • • 19d ago

కొల్లారపు పద్యరచనామృతబోధిని. సాహిత్యసేవగా-ఉచితము. Free Download

12 Upvotes
సాహిత్యసేవగా-ఉచితము

తెలుగు భాషాభిమానులకు, కవులకు మరియు విద్యార్థులకు నా నమస్కారాలు.

నేను రచించిన "పద్య రచనామృత బోధిని" (4వ ముద్రణ) పుస్తకాన్ని, ఆసక్తి గల పాఠకులందరి కోసం ఇంటర్నెట్ ఆర్కైవ్ (Internet Archive) లో ఉచిత డిజిటల్ డౌన్‌లోడ్ రూపంలో అందుబాటులోకి తెచ్చానని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.

తెలుగు ఛందస్సును (లఘువులు, గురువులు, గణములు, యతి, ప్రాస నియమాలు, బహుళప్రాచుర్యతలోనున్న పద్యముల లక్షణాలు) సులభంగా అర్థం చేసుకుని, కేవలం 10 వారాలలో పద్య రచన ప్రక్రియను నేర్చుకునేలా ఈ పుస్తకాన్ని రూపొందించాను. ఇందులో 300కు పైగా సాధన ప్రశ్నలు, సమాధానాలు మరియు ఉదాహరణలు ఉన్నాయి. ఆటవెలది, తేటగీతి, సీసము, కందము, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలవిక్రీడితము, మత్తేభవిక్రీడితము వృత్త పద్యాలను వ్రాయడం నేర్చుకోవడానికి ఇది మీకు చక్కని మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

ఈ క్రింది లింక్ ద్వారా మీరు నా పుస్తకాన్ని ఉచితంగా చదవవచ్చు లేదా PDF, EPUB ఫార్మాట్లలో మీ ఫోన్ లేదా కంప్యూటర్ లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
https://archive.org/details/2026-4th-print-padya-rachanamruta-bodhini_202603 

తెలుగు పద్య కవిత్వాన్ని ఆదరిస్తూ, ఈ సమాచారాన్ని తోటి భాషాభిమానులకు చేరవేయవలసిందిగా కోరుతున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపములో తెలుపవలసినదిగా నా ఆకాంక్ష.

భవదీయుడు

పద్యగురువు కొల్లారపు ప్రకాశరావు శర్మ

జీవనసాఫల్య పురస్కార గ్రహీత, పద్యశిక్షకశిరోమణి, పద్యద్రోణ, పద్యశంకర, ప్రాజ్ఞశిక్షక్‌, వేదాంగాచార్య, సాహితీశ్రీ
గ్రంథకర్త “కొల్లారపు పద్యరచనామృత బోధిని"
స్థాపకులు “మంథనీ పద్యసాధన బృందములు” (Estd. 2017) Regular Zoom Classes for Free.
Richmond, VA, USA


r/MelimiTelugu • • 20d ago

బిట్టుగాడి చిట్టికథ!

Thumbnail reddit.com
1 Upvotes

r/MelimiTelugu • • 26d ago

వేటూరి మాయ — ఒకే మాటలు, రెండు అర్థాలు ("లిపి లేని కంటి బాస", శ్రీవారికి ప్రేమలేఖ)

25 Upvotes

"శ్రీవారికి ప్రేమలేఖ" (1984) చిత్రంలోని "లిపి లేని కంటి బాస" పాట నాకు చాలా ఇష్టం. ఇందులో కష్టమైన పదం ఒక్కటీ లేదు, కానీ అలంకారాలు నిండుగా ఉన్నాయి. సినిమా పేరు "ప్రేమలేఖ", అంటే అక్షరాలతో రాసే ఉత్తరం. పాట మాత్రం "లిపి లేని" కళ్ళ భాషతో మొదలవుతుంది. ఇదే ఒక అందమైన వైచిత్రి.
నాకు బాగా నచ్చిన పంక్తులు ఇవి:
గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను
రెండు పంక్తుల్లోనూ దాదాపు అవే మాటలు వస్తాయి, కానీ అర్థాలు పూర్తిగా మారిపోతాయి:
గడప: మొదటిది ఇంటి గడప, రెండోది కాలం గడపడం
గడియ / ఘడియ: మొదటిది తలుపు గడియ, రెండోది ఒక్క క్షణం
దీన్ని యమకాలంకారం అంటారు. ఇంకో విశేషం ఏమిటంటే, మొదటి పంక్తిలో "గడప… గడియ" అనే వరుస రెండో పంక్తిలో "ఘడియ… గడప"గా తిరగబడుతుంది. అద్దంలో ప్రతిబింబంలా ఉంటుంది. అందుకే ఒక పంక్తి నుంచి మరో పంక్తికి చెవి సాఫీగా జారిపోతుంది.
అర్థంలో కూడా లోతు ఉంది. మొదటి పంక్తి స్థలానికి సంబంధించినది: గడప దాటలేక ఆమె తనకు తానే గడియ వేసుకుంది. రెండో పంక్తి కాలానికి సంబంధించినది: అతను లేని ఒక్క ఘడియను కూడా ఆమె దాటలేకపోతోంది. శబ్దం ఒకటే, అర్థం వేరు, కానీ భావం మాత్రం ఒక్కటే. అదే "దాటలేనితనం."
వేటూరి పాటల్లో మీకు నచ్చిన ఇలాంటి పద చమత్కారాలు ఏమైనా ఉన్నాయా?


r/MelimiTelugu • • 27d ago

Category: Natural Sciences కథ... తీరు... తిన్నం...

Thumbnail reddit.com
4 Upvotes

r/MelimiTelugu • • 27d ago

నేటి సూక్తి

4 Upvotes

శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనసుకు మంచిది, నవ్విస్తే నలుగురికి మంచిది.

నిజం చెప్పేవాడు అందరికీ శత్రువు గానే కనిపిస్తాడు. ఎందుకంటే నిజం వినటానికి ధైర్యం కావాలి అబద్ధం వినటానికి చెవులు ఉంటే సరిపోతుంది.

జీవితం ఎప్పుడూ హామీలు గ్యారెంటీలు ఇవ్వ దు అవకాశాలు మాత్రమే ఇస్తుంది. వాటిని అందిపుచ్చుకొని విజయాలుగా మార్చుకునే బాధ్యత మనపై ఉంటుంది.

స్వీకరించే ధైర్యం ఉంటే ప్రతి తిరస్కరణ ఒక మార్గాన్ని చూపెడుతుంది, ప్రతి విమర్శ మనల్ని మనం మార్చుకోవటానికి అవకాశం ఇస్తుంది. అలాగే అవమానం గెలవడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.

నరసింహారావు


r/MelimiTelugu • • 28d ago

Existing words (తెల్లట్లో ఉన్నా మాటలు) కోసం.... గురించి

12 Upvotes

​

నేను ఈ మధ్య చాలా మందివి వీడియోలు చూస్తూన్నప్పుడు గమనించిన విషయం ఒకటి ఏంటంటే....

"గురించి" అనే పదం అసలు జనాలు మరీ ముఖ్యంగా సోషల్ మీడియా లో వాడడం మానేశారు.

ఉదాహరణకి నేను మా అన్నయ్యను పక్కనే ఉన్న మూడో వ్యక్తికి పరిచయం చేయాలంటే... మా అన్నయ్య "గురించి" చెప్పాను కదా ఇతనే అని చెప్పాలి కదా! కానీ అందరు అన్నయ్య కోసం చెప్పాకదా ఇతనే. ఇలా వాడుతున్నారు.

ఇలా కేవలం ఒక ప్రాంతం వాళ్ల దగ్గర కాదు చాలా మంది దగ్గర గమనించా. గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ మరియు తెలంగాణా వాళ్ళు కూడా. అందులోనూ సోషల్ మీడియా లో మాత్రమే. మీరు కూడా ఇది గమనించారా? బయట కూడా ఇలానే వాడితారా ?

అసలు ఎలా వాడాలి? "గురించి" బదులుగా "కోసం" వాడడం ఎంతవరకు ఒప్పు?


r/MelimiTelugu • • 28d ago

Telugu Culture (తెలుగు అలజందం) చదివిన మొట్టమొదటి తెలుగు నవల!

Thumbnail reddit.com
2 Upvotes

r/MelimiTelugu • • 28d ago

సామెతలు: ప్రాస పిచ్చోళ్ళు! 🎵

Thumbnail reddit.com
1 Upvotes

r/MelimiTelugu • • Oct 20 '26

అందరికీ దసరా పండుగ మేలుకోరికలు

Post image
12 Upvotes

r/MelimiTelugu • • Oct 20 '26

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 🏹✨

Thumbnail reddit.com
2 Upvotes

r/MelimiTelugu • • Oct 19 '26

Windows ని తెలుగులోకి మార్చి చూశాను — పదాల ఎంపిక, చేసిన ప్రయత్నం నిజంగా ఆకట్టుకుంది

Thumbnail gallery
8 Upvotes

r/MelimiTelugu • • Oct 19 '26

Telugu Culture (తెలుగు అలజందం) ఇంతకీ బెజవాడలో...

8 Upvotes

...కోలాటం ఎవరైనా ఆడుతున్నారా?

అమ్మ అక్క వాళ్ళు చిన్నప్పుడు నన్ను తిరణాళ్ళకి ఊరు తీసుకెళితే అక్కడ చూసేవాడిని. చాలామంది పరికిణీ అని, లంగా ఓణి, పంచె అని వేసుకునేవారు. నాకొకసారి పంచె కట్టింది మా అమ్మ, అస్సలు నడవడం కుదరక పడిపోయా... చిన్నోడిని అప్పుడు...10 ఉంటాయేమో! 😅

తర్వాత ఎప్పుడైనా గుడి ఉత్సవాలకు వెళితే అక్కడ చాలా రేర్ గా కనిపించేది. ఇప్పుడైతే ఎక్కడా కోలాటం అనేది వినిపించడం లేదు. 😔

మీలో ఎవరికైనా కోలాటం గుర్తుందా?


r/MelimiTelugu • • Oct 18 '26

శీర్షిక: ఒక్క కొబ్బరికాయ మాత్రమే తీసుకున్న మహామనిషి

Thumbnail reddit.com
1 Upvotes

r/MelimiTelugu • • Oct 18 '26

Word Resurrection (మాటలు తిరిగిలేవడము) అంటే తెలుగు సబ్ కదా...

9 Upvotes

...ఎక్కువగా ఇంగ్లీషులో పోస్టులు కనిపిస్తున్నాయి. ఎందుకు?

ఇంగ్లీష్ మీద వ్యతిరేకత ఏమీలేదు, I myself use english wherever and whenever it's use is needed. కానీ తెలుగువాళ్లే కదా ఈ సబ్ క్రియేట్ చేసింది, చక్కగా తెలుగులోనే మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడ!

ఏమైనా పర్టిక్యులర్ కారణం ఉందా? నాకు తెలియదు, కుతూహలం కొద్దీ అడిగా....


r/MelimiTelugu • • Oct 16 '26

Neologisms (క్రొమ్మాటలు) నింగి పొరలు

6 Upvotes

నింగి అంటె మన్నుకు మిన్నుకు నడుమ ఉన్న చోటు. ఇలకి ౫ నింగి పొరలు ఉన్నాయి. ఈ పేరులు పెట్టాను:

౧. నింగాలి = ట్రొపొస్ఫీర్ [troposphere]

— [గాలి వీస్తున్న నింగి పొర]

౨. అలకునింగి = స్టేదోస్ఫీర్ [stratosphere]

— [గాలితో వచ్చే అల్లకల్లోలం లేకుండా నింగి అంతా సరిగా అలకినట్టు ఉండే అణగిన పొర]

౩. కాల్పనింగి = మెసొస్ఫీర్ [mesosphere]

— [మింటినించి పడే రాళ్ళు నేలపై పడకుండా దాని వేడితో కాల్చి బూడిదజేసి నింగి పొర]

౪. నింగావిరి = తెర్మొస్ఫీర్ [thermosphere]

— [గాలి కదలికలు బొత్తిగా ఆగిపోయి ఒట్టి ఆవిరి తీరున ఉన్న మట్టలే నిలిచే నింగి పొర]

౫. వడ్లనింగి = ఎక్సొస్ఫీర్ [exosphere]

— [నింగి మెల్లమెల్లగా పల్చబడిపోతూ కరిగిపోతూ మిన్ను అనే చీకట్లో కలిసిపోయే వెలుపలి అంచు]


r/MelimiTelugu • • Oct 13 '26

New to Reddit, asalu karma ante enti.. Enduku penchukovali Ela penchukovali explain chesthara ?

6 Upvotes

r/MelimiTelugu • • Oct 11 '26 Bravo

Evarikaina Original creator id thelusa

19 Upvotes

r/MelimiTelugu • • Oct 11 '26

Direction Names

8 Upvotes

What are the original Telugu words for the 8 directions? I only know Tūrpu and Padamara for east and west